భారత దేశపు ఉక్కమనిషి, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి ఘనంగా నిర్వహించారు ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, సెట్నల్ సిఈఓ శ్రీమన్నారాయణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

