గ్రామ సచివాలయ సిబ్బంది విధులు బాధ్యతగా నిర్వహించాలని ఎంపీడీవో పి. అజిత అన్నారు. మండలంలోని దోసకాయలపాడు సచివాలయాన్ని ఎంపీడీవో శుక్రవారం సందర్శించారు. ప్రజలకు సచివాలయాల ద్వారా అందే సర్వీసులను ప్రజలకు త్వరగా అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతిసర్వేను వేగవం తంగా పూర్తి పురోగతి సాధించాలన్నారు. సర్వేలుపూర్తి చేయటంలోసచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులునిర్వహించాలని, సర్వేలు నిర్వహించటంలో నిర్యక్ష్యం వహిస్తే శాఖాపరచర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. సచివాలయ రికార్డులనుపరిశీలించారు. సచివాలయ సిబ్బంది హజరు వివరాలను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ఉదయం 10గంటలలోపు, సాయంత్రం 5తరువాత మఖ హజరు వేయలాన్నారు. ఈకార్యక్రమంలో, దర్శిమార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎన్.స త్యన్నారాయణ, పంచాయతీకార్యదర్శి మెలకయ్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తపాలెంలో పారిశుద్యపనులను పరిశీ లించిన ఎంపీడీవో
తాళ్లూరు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం ప్రాధమిక పాఠశాల పరిసరాల్లో జరు గుతున్నపారిశుద్యపనులను ఎంపీడీవో అజిత శుక్రవారంపరిశీలించారు. పాఠశాల పరిసరాలు పిచ్చి మొక్కలతో వుండటంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారి శుధ్య కార్మికులు పిచ్చి మొక్కలు తొలగించి పాఠశాల సమీపాన గల కాలువ పూడిక తీత పనులు చేపట్టారు. ఎంపీడీవో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున పారిశుద్యంపై దృష్టి సారించాలని కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ షహనాజ్ బేగం, తదితరులు పాల్గొన్నారు.


