పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా శుక్రవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమమును జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మన జిల్లాలో తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ, జిల్లా పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో విద్యార్థుల కోసం వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు మరియు ఓపెన్ హౌస్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పోలీసుల విధులు, వారు వాడే ఆయుధాలు, పరికరాలు, బాధ్యతలు, శాంతిభద్ర నిర్వహణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే తెలుసుకోడానికి ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం దోహదపడంతోపాటు, భవిష్యత్తులో పోలీస్ శాఖలో చేరేలా ప్రేరణ కలిగించే విధంగా నిర్వహించమన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని, క్రమశిక్షణ అలవర్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఒంగోలు పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ ఓపెన్ హౌస్ ప్రదర్శనలో పోలీసులు వాడే ఏకే-47 తో పాటు పలు గన్ లు ,
యాక్షన్ గన్, మెటల్ డిటెక్టర్, డ్రాగన్ లైట్, ర్యాకర్, బాంబు డిస్పోజల్ పరికరాలు, బాంబ్ బ్లాంకెట్, పలు పరికరాలు, వివిధ రైఫిల్స్ & పిస్టల్, త్రోయింగ్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, కమ్యూనికేషన్ వాహనం, 207 వజ్ర వాహనం, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందాలు, ట్రాఫిక్ పరికరాలు, రోడ్ సేఫ్టీ వాహనాలు, నైట్ విజన్, డే విజన్ పరికరాలు, బైనాక్యులర్, డ్రోన్ కెమెరాలు, వ్రేలిముద్రల సేకరించే పరికరాలు అవి పనిచేయు విధానం గురించి ఎస్పీ విద్యార్ధులకు, ప్రజలకు స్వయంగా వివరించారు.
*అబ్బురపరిచిన పోలీస్ జాగిలాలు విన్యాసాలు*
విన్యాసాలులో భాగంగా ముందుగా జిల్లా ఎస్పీ కి చీటా, జాకీ జాగిలాలు గౌరవ వందనం చేశాయి. ఆ తర్వాత జాకీ జాగిలం తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాటకుంటూ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఉపయోగపడే హార్డిల్స్ జంపు విన్యాసాలు విద్యార్థులను ఎంతగానే అబ్బురపరిచాయి. ఈ జాగిలాలు పేలుడు పదార్థాలు మరియు హత్యలు, దొంగతనాలు జరిగిన సందర్భాలలో నిందితులను గుర్తించడం కోసం జాగిలాలు విధులు నిర్వహిస్తాయి.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ సీఐ లు నాగరాజు, శ్రీనివాసులు, విజయకృష్ణ,ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు,ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి,ఎఆర్ ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.





