బేగంపేట నవంబర్ 1 (జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరం లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద చెత్త లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా కొంత మంది అధికారులు,సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బేగంపేట డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ పరిధి లో విద్యుత్ స్తంభాలకు,తీగలకు పిచ్చి చెట్లు అల్లుకుంటున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కురుస్తున్న సమయంలో విద్యుత్ షాక్ కొట్టే అవకాశం ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు ,సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని స్థానికులు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఈ చెట్ల కొమ్మలు విద్యుత్ స్తంభాలకు అల్లుకున్న ప్రాంతంలో చిన్నారులు అట లాడుకుంటున్నారని. ఏ క్షణంలో ఏమి ప్రమాదం జరుగుతుందోనని చిన్నారుల తల్లి దండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి కైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్తంభాలకు అల్లుకున్న చెట్ల కొమ్మలు,తీగలను తొలగించాలని కోరుతున్నారు.


