మియాపూర్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు. ..ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5అంతస్తుల భవనం కూల్చి వేసిన హైడ్రా అధికారులు.

మియాపూర్ నవంబర్ 1
(జే ఎస్ డి ఎం న్యూస్) : మియాపూర్ లో అక్రమ కట్టడంపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు.ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని కూల్చి వేశారు.అమీన్పూర్ లో అనుమతులు పొంది మియాపూర్ ప్రభుత్వ భూమి(హెచ్ ఎం డి ఏ కు చెందిన)లో అక్రమ కట్టడాలు నిర్మించారు.అమీన్పూర్ లోని సర్వే నంబర్ 337, 338 ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు నిర్మించారు. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని దానికి పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి భాను కన్స్ట్రక్షన్ సంస్థ 126/D , 126/ పార్ట్ 126/C గా ప్లాట్లు సృష్టించారు. మియాపూర్లోని హెచ్ ఎం డి ఏ భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల స్థలాన్ని ఆక్రమించి 5 అంతస్తుల భవనం నిర్మాణం చేశారు.ఫేక్ ఎల్ ఆర్ ఎస్ సృష్టించారు.వారు ఎల్ ఆర్ ఎస్ కోసం డబ్బులు చెల్లించినట్టు పేర్కొన్న డి డి కూడా నకిలీది గా గుర్తించారు.ఈ మేరకు ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని హైడ్రా అధికారులు శనివారం తొలగించారు.సదరు సంస్థ ప్రభుత్వ భూమి లోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హెచ్ ఎం డి ఏ అధికారులు హైడ్రా కు పిర్యాదు చేశారు.దీంతో స్థానిక రెవెన్యూ,హెచ్ ఎం డి ఏ , మున్సిపాలిటీ అధికారులతో కలసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు నిర్ధారించుకున్నారు. 2014లో ఎల్ ఆర్ ఎస్ నకిలీ పత్రాల సృష్టించినట్టు నిర్ధారణ చేసుకున్నారు.అన్నీ పరిశీలించి శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనం ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. హైడ్రా అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రాంతంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎట్టకేలకు అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *