కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో బాధితులకు ఎంతో భరోసా దొరికినట్లయినదని టిడిపి ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు అన్నారు. తాళ్లూరు మండలంలో తుఫాన్ పునరావాస బాధితులకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలలో మంత్రులు ఎక్కడిక్కడ పర్యవేక్షించి అధికారులు నిత్యం ప్రజలను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. మరలా వారు కోలు కునే వరకు ప్రభుత్వం సహాయం చేయటం మానవత్వానికి ప్రతీక అని అన్నారు. మండలంలో 93 కుటుంబాలకు 254 మందికి రూ.2.13 లక్షలు పరిహారం పంపిణీ చేసినట్లు ఆమండల తహసీల్దార్ రమణా రావు తెలిపారు. టిడిపిపార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, నియోజక వర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మీరా మోహినుద్దీన్, నాయకులు వలి, తిరుపతి రావు, డిటీ ఫణీ, విఆర్ ఓ చంద్ర తదితరులు పాల్గొన్నారు.



