దోర్నపు వాగు ఉధృతికి రెండు పశువులు బలి అయ్యాయి.
కొర్రపాటి వారి పాలెంకు చెందిన గోనుగుంట బాబు రావు తన పశులకు మేతకు తోలుకెళ్లాడు. దప్పికతో వాగులోనికి దిగిన పశువులు వాగు ఉధృతికి నుడి గుండంలో చిక్కుకుని మృతి చెందాడు. రెండు పశువుల విలువ రూ.4 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. పాడి పశువుల ఆధారంగా జీవనం సాగించే బాబు రావు తన పశువుల మృతితో తీవ్ర ఆవేదన కు గురైనారు. ప్రభుత్వం బాధిత రైతును అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
