ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, దరశిలో ని శ్రీ ప్రశాంత హైస్కూల్ నందు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా ప్రకాశం జిల్లా ఐఆర్సీయస్(ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ)ఎగ్జికూటివ్ మెంబర్, ఉమ్మ డి ప్రకాశం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి.శ్రీరాములుకు ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భాషా సంయుక్త రాష్ట్రాల సాధనలో భాగంగా, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, రాష్ట్ర సాధనలో భాగంగా తన ప్రాణాలర్పించిన మహోన్నతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములని,ఆయన త్యాగాలను, సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మరువకూడదని,ప్రతి ఒక్కరూ పోరాట పఠిమగలిగి వుండాలని, అన్నీ సందర్భాలలో పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కపురం శ్రీనివాసరెడ్డి విద్యార్థులకు సూచించారు.అనంతరం వ్యాసరచనలో నెగ్గిన విద్యార్థినులకు కపురం శ్రీనివాసరెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *