మాజీ పార్లమెంటు సభ్యులు, పూర్వ టీటీడీ బోర్డు చైర్మన్ వై. వి సుబ్బారెడ్డి పై కల్తీ నెయ్యి నింద మోపడం సరికాదని ప్రకాశం జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు గుంటక తిరపతి రెడ్డి అన్నారు.
శనివారం వెలిగండ్ల మండలంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కల్తీ నెయ్యి నింద మాజీ పార్లమెంట్ సభ్యులు వై వి సుబ్బారెడ్డి మోపటానికి ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరం అని ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్న సమయంలో అభివృద్ధి మార్కు చూపించారని ఒక్క మా వెలిగండ్ల మండలంలోని ఫ్లోరైడ్ గ్రామాల్లో సుమారు 20 ఆర్ఓ ప్లాంట్లు తన నిధులను మంజూరు చేసి ఫ్లోరైడ్ బాధితులు ఆదుకోవడం జరిగిందని, కనిగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయించి కిడ్నీ బాధితులను ఆదుకోవడం జరిగింది టిటిడి చైర్మన్ గా ఆయన పాలనలో ఎంతో పారదర్శకంగా తిరుమల పవిత్రతను కాపాడి రాష్ట్రమంతటా దళిత గోవిందం కార్యక్రమాలు నిర్వహించి తిరుమల పవిత్రతను రాష్ట్రమంతటా చాటి చెప్పిన వ్యక్తి కల్తీ నెయ్యి వివాదం మొదలవగానే సిబిఐ ఎంక్వైరీ కోరిన మొదటి వ్యక్తి ఎంతో నిజాయితీపరుడైన వై. వి సుబ్బారెడ్డి పైన ఇటువంటి ఆరోపణ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు.
