బేగంపేట నవంబర్ 3
(జే ఎస్ డి ఎం న్యూస్)సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లోనీ శ్రీ వీరభద్ర స్వామి,మహాకాళేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. సోమవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. కలెక్టర్ హరిచందన తో పాటు నార్త్ జోన్ డీ సీ పీ సాధన
రష్మీ పెరుమాళ్ , ఈ ఓ గుత్తా మనోహర్ రెడ్డి దంపతులు కార్తీక దీపాలు వెలిగించారు.అనంతరం ఆలయ ప్రాంగణం లో మొక్కలు నాటారు.భక్తులకు వాయినాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యం,కర్ణాటక సంగీతం ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన చేసిన చిన్నారులను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు.కార్తీక మాసం సందర్భంగా ఆలయాన్ని రంగు రంగు ల విద్యుత్ దీపాలు,వివిధ రకాలైన పూల తో సుందరంగా ముస్తాబు చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి,ఫౌండర్ ప్యామిలీ మెంబెర్స్ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.




