చీమకుర్తి మండలం బండ్లమూడిలో ఇరు వర్గాలకు చెందిన వారు పోలీసుల సమక్షంలోనే ఘర్షణ పడి బాహా బాహీకి దిగారు. అదే గ్రామానికి చెంది ఓ వర్గానికి చెందిన వారి భూములలో మరో వర్గానికి చెందిన వారి జీవాలు వెళ్లి పంటను ద్వసం చేసారని పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేసాడు. దీంతో మరో వర్గానికి చెందిన వారు తమపై ఫిర్యాదు చేస్తారా అంటూ వాదోపవాదాలకు దిగిటంతో మాటా మాట పెరిగి ఘర్షణ జరిగింది. పలువురికి గాయాలైనాయి.


