జిల్లా సమీక్ష కమిటీ ( డిఆర్సి ) సమావేశానికి పూర్తిస్థాయి సమాచారంతో సన్నద్ధం కావాలని కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. ఈనెల ఏడో తేదీన డిఆర్సి సమావేశం ఉన్న నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి వివిధ
విభాగాల ఉన్నతాధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో మంత్రివర్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తయారు చేయడంపై చర్చించారు. జిల్లాలో ఇటీవలి తుఫాన్ ప్రభావం, వివిధ రంగాలలో నష్టం, వాటి అంచనాల రూపకల్పన, తదితర అంశాలపై పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి సిద్ధం కావాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.


