గ్రామాలలో ఇంటి పన్నులను డిజిటల్ లావాదేవీల రూపంలో చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

గ్రామాలలో ఇంటి పన్నులను డిజిటల్ లావాదేవీల రూపంలో చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ పోస్టరును మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఇంటి పన్ను చెల్లింపు విధానంలో పారదర్శకత, వేగం, కచ్చితత్వాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది అన్నారు. స్థానిక సంస్థల్లో పారదర్శకతను పెంచేందుకు అమలు చేస్తున్న ఈ విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *