పోలీస్ స్టేషన్ కువెళ్లిన దళితనేతల పట్ల అనుచితంగా వ్యవహిరించిన తాళ్లూరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలి- దళిత నేతలు

తప్పుడు కేసులు నమోదు చేయటంతోపాటు, ఎందుకు తమపై కేసులు నమోదు చేశారని అడిగేందుకు వెళ్లిన దళిత నేతలను దుర్షాషలాడి బయటకు పంపిన తాళ్లూరు ఎస్సై ఎస్. మల్లిఖార్జురావుపై చర్యలుతీసుకోవాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నాయకులు అనపర్తి ఆదామ్ మాదిగ్ లు డిమాండ్ చేశారు. దళితుల పట్ల ఎస్సై మల్లిఖార్జునరావు అనుచిత వైఖరిని నిరసిస్తూ తాళ్లూరు దళితవాడనాయకులు, దళిత కాలనీ వాసులు, మహిళలు ఎం. పీడీవో కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షులుదారా అంజయ్య మాట్లాడుతూ …శివరామ పురం గ్రామంలో గత రెండు రోజుల కిత్రం వివాహ వేడుకల్లో కొందరు యువకులు అనుమతులు లేకుండా డాన్సులు వేస్తూ కార్యక్రమాలు నిర్వహించగా ఉన్నతాదికారుల ఆదేశంతో కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. ఆ వివాహ వేడుకల్లో తాళ్లూరు దళిత వాడకు చెందిన డిజే బాక్స్ లు అద్దెకు ఇచ్చే అనపర్తి విజయ్ కుమార్
(బాబు) డీజేఏర్పాటు చేశారన్నారు. పొట్ట కూటి కోసం వెళ్లిన వారిపై కేసు నమోదు చేయటమేకాక స్టేషన్ కు
పిలిపించి డిజే ఏర్పాటు చేసిన యజమానికి దారుణంగా దూషించారన్నారని ఆరోపించారు.
డిజే తీసుక వెళ్లిన కూలీని ఎస్సై తన ఇష్టాను సారం కొట్టడం జరిగిందన్నారు
విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ కు
వెళ్లిన బాబు తండ్రి అనపర్తి సత్యవర్ధనరావు ఏతప్పు చేశారని మా అబ్బాయిని కొడుతున్నారన్న
నెపానికి అతనిపై ఎస్సై కుల దూషణ చేశారన్నారు. ఎస్సైతో మాట్లాడేందుకు వెళ్లిన ఎస్సీసెల్ నేత సుబ్బారావును తన ఇష్టాను సారం బండ బూతులు తిడుతూ బయటకు వెళ్లమని పంపివేయటం ఎంత వరకు సమంజసమన్నారు. బృతి కోసం వెళ్లిన వ్యక్తిని కొట్టడమే కాక దూషించటం ఎస్సై అనుచిత ప్రవర్తను నిదర్శనమన్నారు. ఎస్సైపై తగు చర్యలుతీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎమ్మా ర్పిఎస్ నేత ఆదాం మాదిగ్ మాట్లాడుతూ.. శివరాంపురం గ్రామవివాహ వేడుకల్లో కత్తులతో హల్చల్ చేసిన వ్యక్తులను నమోదు చేసిన పోలీసులు వారికి డిజే ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ను వదిలేసి బ్రతుకు దెరువుకు డీజె తీసుక వెళ్లిన ఆటోను కేసులో పెట్టారన్నారు. డిజేను తీసుక వెళ్లిన కూలీని స్టేషన్ కు పిలిపించి చేతులు వాచేటట్లు ఎస్సై కొట్టాడన్నారు. డీజే లు,
బ్రతుకు దెరువుకు డిజై తీసుక వెళ్లిన ఆటోను కేసులో పేట్టారన్నారు. డీజే లు, ఆటో ఇవ్వాలంటే 50 వేల రూపాయలు చెల్లించాలని ఎస్సై చెప్పాడని కానిస్టేబుల్ ను పంపాడన్నారు. ఆడబ్బులు చెల్లిస్తే ఎలాంటి కేసులు లేకుండా ఎస్సై చేస్తాడని చెప్పాడన్నారు.డబ్బులు చెల్లించలేదని వారిని స్టేషన్ కు పిలించి హింసించారన్నారని ఆరోపించారు. దళితులపట్ల అనుచితంగా వ్యవహిరించిన ఎస్సైపై తగు చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు గర్నెపూడి యోహాన్, విజయ్ కుమార్, అనపర్తి సత్యవర్థన్ రావు, దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *