ప్రకృతి సాగు పద్ధతులతో నేలకు సాగుకు పునరజ్జీవనం వస్తుందని దర్శి ఎడీఏ బాలాజీ నాయక్ అన్నారు. మండలంలోని నాగంబొట్ల పాలెం, రామభద్రాపురం, తూర్పుగంగవరం లలో ఏర్పాటు చేసిన రబీ -25 ప్రణాళికలో బాగంగా రైతులతో సమావేశం నిర్వహించారు. వరద నీరు తగ్గిపోయిన తర్వాత సూక్ష్మ జీవులలో జీవాలను పెంచుతుందని ప్రకృతి సాగు తో అడ్డుకట్టవెయ్యాల్సిన విధానాన్ని వివరించారు. జీవామృతం తయారు విధానాన్ని డ్రిప్ల ద్వారా పంపించే వైనాన్ని డెమోలో వివరించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహాం, విఏఏ లు సుప్రియ, సుప్రజ, ఐసీఆర్ పీలు వాణి, కోటి రత్నం , అనంతరమ్మ, కోటి పల్లవి, మహిళా రైతులు పాల్గొన్నారు.

