తాళ్లూరు బొడ్డు రాయి కేంద్రం వద్ద మంగళవారం పలు భారీ వాహనాలను, లారీలు, టిప్పర్లను ఎస్సై మల్లికార్జున రావు తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనుమతి పత్రాలను, లోడ్ పరిమితిని పరిశీలించి రోడ్లు వర్షాలతో దెబ్బతిన్నందున జాగ్రత్తగా నడపాలని కోరారు. ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నట్లు చెప్పారు.
