విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని బాధ్యత ఉపాధ్యాయలు, తల్లిదండ్రలపై ఉందని మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య అన్నారు. తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ప్రారంభమైనాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈఓ సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు సుబ్రమణ్యం మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ సంబరాలు గత
37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ ఉన్నత ప్రధానోపాధ్యాయులు వైఎస్ ఆర్ కే ప్రసాద్, అంజలి. శ్రీనివాస రావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

