వర్షాలు అధికంగా కురవటంతో లోటు వర్షపాతం కాస్త.. అధిక వర్షపాతంగా మారింది. దీంతో పాతాళగంగా పైకి పొంగుతుంది. భూముల్లో ఊటలు కూడా ఎక్కువయ్యాయి. తాళ్లూరు మండలం కొత్త పాలెం గ్రామ రైతు మారంవెంకటరెడ్డి పొలంలో ని బోరు బావి లో మోటార్ లేకుండానే నీరు పెల్లుబికింది. బోరు మోటార్ తీసి వేసి ఉపయోగించని బోరు నుండినీరు పెల్లుబికి వోస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు భూమిలో నీరు అధికంగా చేరి బోర్లందు నీటి మట్టం పెరిగింది. గ్రామస్తులు ఆ బోరు వద్దకు వెళ్లి నీరు దానంతంట అదే పెల్లుబుకటం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
