ప్రజా రవాణా వ్యవస్థను మరింత భద్రత, పటిష్టతకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా కమీషనర్ అర్ సుశీల తెలిపారు. ఉప రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం మోటార్ వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా ఉప రవాణా కమీషనర్ అర్ సుశీల మాట్లాడుతూ కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల అన్ని కూడ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. కాలేజి, స్కూల్ బస్సులను తనిఖీ చేసి సక్రమంగా పన్ను చెల్లించని వాటిపై కూడ ప్రత్యేక శ్రర్థ వహించాలని కోరారు. సమావేశంలో ప్రాంతీయ రవాణా శాఖాధికారి వై చందన, మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎ కిరణ్ ప్రభాకర్, ఎల్ సురేంద్ర ప్రసాద్, సహాయ మోటార్ తనిఖీ అధికారులు కె జయ ప్రకాశ్, యు ధర్మేంధ్ర, డి జశ్వంత్, పరిపాలన అధికారి ఎం శ్రీనివాస రావు లు పాల్గొన్నారు.
