బేగంపేట నవంబర్ 5(జే ఎస్ డి ఎం న్యూస్):
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం లో పౌర్ణమి సందర్బంగా చండీ హోమము నిర్వహించారు.ఈ హోమంలో సుమారుగా 300 కి పైగా భక్తులు పాల్గొన్నారు.ఈ హోమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి జి.మనోహర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. పూజా అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేశారు. పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో సహాయ కమీషనర్,కార్యనిర్వహణాధి కారి గుత్తా మనోహర్ రెడ్డి,ఫౌండర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆధ్వర్యంలో పటిష్టమైన మైన ఏర్పాట్లు చేశారు.





