బేగంపేట నవంబర్ 5 (జే ఎస్ డి ఎం న్యూస్) ;
కార్తీక పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్,బేగంపేట పరిధిలోని ఆలయాలు భక్తుల తో కిట కిట లాడాయి.హర హర మహాదేవా,శంభో శంకరా అంటూ భక్తులు స్వామి వారి నామాన్ని స్మరిస్తూ ఆలయాలలో పూజలు నిర్వహించారు.మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు.సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా
శ్రీ ఉజ్జయినీ మహా కాళీ ఆలయంలో చండీ హోమం చేశారు.హోమంలో 300కి పైగా భక్తులు పాల్గొన్నారు.సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా భజన గీతాలు ఆలపించారు.కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ వీరభద్ర స్వామి ,మహాకాళేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించారు.జ్వాలా తోరణం కార్యక్రమంలో ఈ ఓ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.ఆలయం మొత్తం దీపాల వెలుగులతో కళ కళ లాడింది.ఎస్పీ రోడ్డు లోని శ్రీ వీరహనుమాన్ ఆలయం లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పీ జీ రోడ్డు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.ప్రకాశం నగర్ శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లో శ్రీ హనుమాన్ దేవాలయంలో కార్తీక దీపాలు వెలిగించారు.కార్తీక దీపోత్సవం లో భాగంగా ఆలయాలన్నీ దీపాల వెలుగులతో ప్రత్యేక ఆకర్షణ గా మారాయి.





