రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నస్వర్ణ పంచాయతీ పోర్టర్ విధుల నిర్లక్ష్యం, రికా ర్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించని కారణంగా తురకపాలెం ఇంచార్జి పంచా యతీ కార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి డిపీవో వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ హౌస్ ట్యాక్స్ అసెస్మెంట్ మాడ్యూలులో మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసే క్రమంలో పంచాయతీ కార్య దర్శి వెంకటేశ్వర్లు ఒకే మొబైల్ నంబర్ ను అసెస్మెంట్లకు ట్యాగ్ చేయటం,-డేటా వెరిఫికేషన్, అప్ డేషన్లో తీవ్రమైన లోపాలు వున్నట్లు గుర్తించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ దృష్టికి వెళ్లింది. పిఆర్ కమీషనర్ విడియో కాన్పరెన్సులలో జిల్లా కలెక్టర్, డీపీవోలతో నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ దృష్టికి వెళ్లింది. పిఆర్ కమీషనర్ విడియో కాన్పరెన్సులలో జిల్లా కలెక్టర్,డీపీవోలతో మాట్లాడారు. స్వర్ణపంచాయతీ పోర్టర్లో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు 608 అసెస్ మెంట్లో 583 కి ఓకే ఫోన్ నంబర్ ఉండటంతో నిర్లక్ష్యంగా వ్యవహించినందున సస్పెండ్ చేయాలనిఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వెంకటేశ్వర్లును సస్పెం
డ్చేస్తూ డిపీవో ఉత్తర్వులుజారీ చేశారు. ఉత్తర్వుల
ప్రతులను ఎంపీడీవోకు అందజేశారు.
స్వర్ణ పంచాయతీ పోర్టర్ విధుల నిర్లక్ష్యంపై తురకపాలెం ఇంచార్జి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
05
Nov