ప్రతి కూల వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలు తీవ్రమైన గాలులు ఊహించని చలి వంటి తీవ్ర పరిస్థితులు ఎదురైనప్పుడు మొక్కలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. వెలుగు వారి పాలెం, రామభద్రాపురంలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచ గవ్య ద్వారా కొత్త పిలకలు, ఆకులు పెరుగుదల ప్రారంభమౌతుందని తెలిపారు. గాలి వలన కలిగిన నష్టాన్ని పూడ్చి పూత, పిందే రాలిపోకుండా నిలబెట్టటానికి ఉపయోగపడుతుదని తెలిపారు. కార్యక్రమంలో విఏఏ ఆదినారాయణ రైతులు పాల్గొన్నారు.
