బేగంపేట నవంబర్ 6 (జె ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి బస్తి చెత్తకుప్పలకు నిలయంగా మారుతుంది . బస్తీలోకి వెళ్లే మార్గంలో ఒకవైపు పబ్లిక్ టాయిలెట్లు మరోవైపు అమీర్పేట్ నాల ఇంకొక వైపు కూకట్పల్లి నాలా ఇలా మూడు వైపులా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండగా బస్తిలోకి వెళ్లే ప్రధాన మార్గం వెంట పబ్లిక్ టాయిలెట్ల పక్కనే పేరుకుపోతున్న చెత్త తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది.దీంతో బస్తీ లోకి వెళ్లేవారు ముక్కు మూసుకొని నడవాల్సిన దుస్థితి. ఉదయం పాఠశాలకు వెళ్లి చిన్నారులు సైతం ముక్కు మూసుకోకుండా నడవలేని పరిస్థితి. నగరం నడిబొడ్డున సీఎం ప్రజావాణి కి కూతవేటు దూరంలో ఉన్న బస్తీలో ఇలాంటి దారుణమైన పరిస్థితి నెలకొని ఉంది. బస్తి ప్రారంభంలో పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో బస్తీ వాసులు రకరకాలైన చెత్తను పడవేస్తూ ఉండడంతో అక్కడ తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుంది.అయితే ప్రతిరోజు జిహెచ్ఎంసి చెత్త ఆటోలు బస్తీలకు వస్తున్న కొందరు చెత్తను ఆటోలు వారికి ఇవ్వకుండా ఇక్కడ పడేసి వెళుతుండటంతో ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో సమీపంలో చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో అంగన్వాడి సెంటర్ కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జిహెచ్ఎంసి అధికారులు బస్తీలో ప్రజలకు అవగాహన కల్పించారు.చెత్తను సేకరించే ఆటోలకు మాత్రమే తమ ఇళ్లలోని చెత్తను అందించాలంటూ సూచించారు. ఈ మేరకు వారు అవగాహన కల్పించారు. ఇప్పుడు చెత్త పేరుకు పోతున్న ప్రాంతంలో వారు చక్కటి రంగు రంగుల రంగవల్లులు వేసి సుందరంగా మార్చారు. అయినా మారని కొందరు వారి మాటలను పట్టించుకోకుండా అదే ప్రాంతంలో చెత్తను పడవేస్తున్నారు. బస్తీ లోని చిన్నారులు మహిళలు ఇలా ప్రతి ఒక్కరు ఇదే మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటారు. అయితే విద్యార్థులు తల్లిదండ్రులు చెత్త పేరుకుపై తీవ్ర దుర్వాసన వల్ల తమ పిల్లలు చెడుగాలి పీల్చి రోగాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చెత్తను బయట పబ్లిక్ మరుగుదొడ్ల వద్ద వేయకుండా బస్తీ వాసులకు అవగాహన కల్పించి బస్తీ వాసులను చిన్నారులను రక్షించాలని కోరుతున్నారు.

