కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల, స్కీమ్ వర్కర్ల కు ఇచ్చిన హమీలను అమలు జరిపై దిశగా ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చేందుకు దర్శిలో ఈనెల 8 వతేదీ సీఐటీయు జిల్లా13వ జిల్లా మహాసభలు జరుగనున్నట్లు సీఐటియు జిల్లా కార్యదర్శి కల్పన తెలిపారు. మండలంలోని పలుగ్రామాల్లో సమావేశానికి జనసమీకరణ చేసేందుకు సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఎన్నికల ముందు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి ఓట్లు పొంది గద్దెనెక్కిన ప్రభుత్వాలు కా ర్మికుల హామీలను నెవేర్చనందున కుటుంబపోషణ కష్టంగా వుండి ఆకలితో అలమ టిస్తున్నారన్నారు. కార్మికులు ఐకమత్యంగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. కార్మికులు 13 వ మహాసభలకు విరివిగాహజరై విజయవంతం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు బి.హనుమంత రావు, గాలి యర్రయ్య, రావి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయకార్మిక సంఘం కార్యదర్శి వెల్లంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు .
