గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయముల మరియు
వాలంటీర్ల శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…… ప్రజల వద్దకే పాలనను పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని బ్లూ మీడియా గుర్తుంచుకోవాలి. క్రెడిట్ చోరీ అని బ్లూ మీడియా అనడం సిగ్గుచేటు, క్రెడిట్ చోరీలో జగన్ ని మించిన వారు లేరు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా, వ్యవస్థపై పర్యవేక్షణ లేకుండా సచివాలయ వ్యవస్థను జగన్ అస్తవ్యస్తంగా తయారు చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా జగన్ వారి జీవితాలతో ఆడుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాం. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో మూడు అంచల వ్యవస్థను తీసుకొస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల అభ్యర్థన మేరకు యూనిఫామ్ నిబంధన తొలగించాం. ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పేరు మార్చుతున్నామని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నామని మంత్రి డా.డోలా బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు నాయుడు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నారు -ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్చుతున్నాం, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన పేరు పెట్టబోతున్నాం
06
Nov