బేగంపేట నవంబర్ 7
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఒక్క సీ సీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని,నేరాల నియంత్రణలో సి సి కెమెరాల ప్రాధాన్యత అత్యంత కీలకం అని బేగంపేట ఏ సి పి గోపాల కృష్ణమూర్తి తెలియజేశారు.హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ వి.సి.సజ్జనార్ నేతృత్వంలో నార్త్ జోన్ డీ సి పి సాధన రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో బేగంపేట డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి కాలనీ అసోసియేషన్ లు వారి ప్రాంతాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
డివిజన్ పరిధిలోని బేగంపేట, బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అసోసియేషన్ సభ్యులు కెమెరాలను నిరంతరం పర్యవేక్షించడం వల్ల నేరాల నియంత్రణ సులభం అవుతుందని ఏ సి పి తెలియజేశారు. డివిజన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలు, చీకటిగా ఉండే ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని ఇలాంటి ప్రాంతాలను నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందని అన్నారు. బేగంపేట పరిధిలోని ధనియాల గుట్ట స్మశాన వాటిక, పరేడ్ గ్రౌండ్, జేబీఎస్ రోడ్, మాతాజీ నగర్, ఓల్డ్ కస్టమ్స్ బస్తి ,ఫతేనగర్ లింక్ రోడ్, ఓల్డ్ పాటిగడ్డ రైల్వే స్టేషన్ ,రసూల్పుర జంక్షన్ బోయిన్పల్లి పరిధిలోని సమతా నగర్ ,డైరీ ఫార్మ్ రోడ్ మరికొన్ని ప్రాంతాలను తాము నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు పనిచేయడం లేదని అన్నారు.వెంటనే కంటోన్మెంట్, విద్యుత్ శాఖ అధికారులు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ప్రధాన రోడ్డులో ఉన్న వ్యాపార ,వర్తక వాణిజ్య కేంద్రాలు ,దుకాణాలు,హోటళ్లతో పాటు కాలనీలు, బస్తీలు, పాఠశాలలు ఇలా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు షాపు ల ముందు కూడా సీసీ కెమెరాలు తప్పక ఏర్పాటు చేయాలన్నారు. ఇలా బయట వైపు ఏర్పాటు చేయటం వల్ల ఆయా ప్రాంతాల్లో జరిగే అన్ని విషయాలను సీసీ కెమెరాలు ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తరచు వాటి పనితీరును పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలను పోలీస్ స్టేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేస్తామని దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సంఘటన జరిగిన నేరం జరిగిన ఫుటేజీని పరిశీలించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీలుంటుంది అన్నారు. ఇప్పటికే బేగంపేట బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సొసైటీలు కాలనీలు బస్తీలలో కెమెరాలు ఏర్పాటుతో కలిగే లాభాలు పై ప్రజలకు వివరించమన్నారు గతంలో ఏర్పాటు చేసిన పలు కెమెరాలు పని చేయక పోవడాన్ని గుర్తించిఇన్స్పెక్టర్లను అప్రమత్తం చేసి వాటిని తిరిగి పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. కొందరు దుకాణదారులు తమ షాపులు మూసివేసిన సమయంలో కెమెరాలు డిస్ ప్లే లను ఆపివేస్తున్నారని దీనివల్ల షాపు నిర్వాహకులు తిరిగి ఉదయం ఆన్ చేసినప్పుడు రాత్రి జరిగిన ఘటనలు గురించి తెలుసుకునే వీలు లేకుండా పోతుందన్నారు. నిర్వాహకులు కెమెరాలను ఆపవద్దని ఎల్లప్పుడూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరం అని ఆయన అన్నారు.బేగంపేట డివిజన్ పరిధిలోని బేగంపేట ,బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు .నేరాల నియంత్రణ, కేసులు పరిష్కారంలో కీలకమైన సీసీ కెమెరాలు ఏర్పాటుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. ఇటీవల కాలంలో నంబర్ల లేని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని,పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో బందిపోటు కేసు ను చేధించామన్నారు.బోయిన్ పల్లి పరిధిలో ఏ టి ఎం దొంగతనం,ఇంటి తాళాలు పగుల గొట్టి దొంగతనానికి పాల్పడిన నేరస్తులను కెమెరాల సహాయంతో గుర్తించామన్నారు.గత సంవత్సరం 62 బైకు లను దొంగిలించిన నిందితులను పట్టుకున్నామన్నారు.ప్రజల సహకారంతో డివిజన్ లో శాంతి భద్రతల ను పర్యవేక్షిస్తామని ఏ సి పి తెలియ జేశారు.
