ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం లో సంక్షేమాధికారి కె. చంద్ర కుమారి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థినులు కళాశాలల సెలవుల మరియు ఇతర పనుల నిమిత్తం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వారి తల్లిదండ్రులతోనే ఇంటికి పంపవలసి ఉండగా, వసతి గృహ సంక్షేమాధికారి మాత్రం ఒంటరిగానే విద్యార్థినులను ఇంటికి పంపడం , విద్యార్దినులను ఇంటికి పంపినప్పుడు బోర్డర్స్ మూమెంట్ రిజిస్టర్ నందు నమోదు చేయాలి కాని అలా రిజిస్టర్ లో నమోదు చేయక పోవటం, వసతి గృహం లో సరిగ్గా మెనూ అమలు చేయక పోవటం , విద్యార్ధినుల పట్ల దురుసుగా మాట్లాడటం , పిల్లల ఆరోగ్యం పట్ల, మెనూ పట్ల, విద్య పట్ల తగు జాగ్రత్తలు తీసుకోక పోవటం వడ్డీ అనేక చర్యలకు పాల్పడుతుండడంతో విద్యార్థినులు స్థానిక శాసనసభ్యులు డాక్టర్. యం. ఉగ్ర నరసింహారెడ్డి వారికి ఫోన్ ద్వారా వసతి గృహ సంక్షేమాధికారిపై ఫిర్యాదు చేయడం చేశారు. గతంలో కూడా సదరు వసతి గృహ సంక్షేమాధికారిపై ఇలాంటి ఆరోపణలు రాగా స్థానిక శాసనసభ్యులు మరియు ఒంగోలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహమును సందర్శించి తన వైఖరిని మార్చుకొనవలసినదిగా హెచ్చరించారు. కానీ తన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. కావున విద్యార్థినుల ఫిర్యాదులపై వసతిగృహ సంక్షేమాధికారిపై వచ్చిన ఆరోపణలపై
జిల్లా డిప్యూటి డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, పి. శివనాయక్, సహాయ సాంఘిక సంక్షేమాధికారి, కనిగిరి వారిని విచారణ చేసి నివేదికలను సమర్పించమని ఆదేశించగా, వారు సమగ్ర విచారణ జరిపి నివేదికలను సమర్పించిన పిదప, జిల్లా డిప్యూటీ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ,సదరు విదారణ నివేదికను జిల్లా కలెక్టర్ కి
కి సమర్పించగా, నివేదికలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ , విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిన కె. చంద్ర కుమారి ని విధుల నుండి సస్పెండ్ చేసారు. సంక్షేమ శాఖలలో హాస్టల్స్ నందు విద్యను అభ్యసించుచున్న విద్యార్థినుల పట్ల వసతిగృహ సంక్షేమాధికారులు విద్య, ఆరోగ్యం, మెనూ ల వంటి విషయములలో నిర్లక్ష్యం వహిస్తే ఎటువంటి పరిస్థితిలో ఉపేక్షించడం జరుగదనియు, నిర్లక్ష్యం వహించు వసతిగృహ సంక్షేమాధికారులపై కఠినమైన చర్యలు తీసుకోనబడునని తెల్పుతూ సంక్షేమ శాఖలలో అందరూ సంక్షేమాధికారులు విధుల పట్ల జాగ్రత్తగా విధులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలుపుతూ, సదరు కళాశాల బాలికల వసతి గృహ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని కనిగిరి
సహాయ సాంఘిక సంక్షేమాధికారి ని కూడా ఆదేశించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్
యన్. లక్ష్మా నాయక్ తెలిపారు.
విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహించిన వసతి గృహ సంక్షేమాధికారిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
07
Nov