విద్యుత్తు శాఖ అనుమతులు లేకుండా అక్రమమార్గంలో విద్యుత్తుచౌర్యానికి పాల్పడితేకఠినచర్యలు తీసుకుంటామని విద్యు త్ విజిలెన్సు ఈఈ హైమావతి హెచ్చరించారు. విద్యుత్ శాఖ
విజిలెన్సు విభాగం ఈఈ పి.హైమావతి, దర్శి ఆపరేష న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.శ్రీనివాసుల సారద్యంతో మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే మొదటిగా కాంపౌడ్ పద్దతిలో, అపరాధరుసుం విధిస్తామని తెలపారు. అపరాధరుసుం చెల్లించినవారు రెండవ సారి చౌర్యానికి పాల్పడితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటం జరుగుతుందన్నారు. ఎవరైనా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలిస్తే వాట్సాప్ ద్వారా, నేరుగా విద్యుత్తు వినియోగదారుల విజిలెన్సు శాఖ నంబర్ 8331019980కు సమాచారం.
తెలపాలన్నారు. వారి వివరాలు గోప్యంగా వుంచుతామన్నారు. నలుగురు వినియో గదారులు అధనపు లోడ్ వాడగా అపరాధ రుసుం రూ. 1560లు, అనుమతి తీసు కున్న కేటగిరి కాకుండా ఇతర కేటగిరి విద్యుత్తు వాడుతున్న ఓ వినియోగదారునికి అపరాధ రుసుం రూ3000లు, విద్యుత్తు మీటర్లు లేకుండా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న 33 మందికి అపరాధ రుసుం రూ1లక్ష56వేలు విధించారన్నారురు. విద్యుత్తు శాఖ తనిఖీల్లో అక్రమాలకు పాల్పడుతున్న వినియోగదారుల నుండి రూ2,41,600ల అపరాధ రుసుం విధించి నట్లు తెలిపారు. ఈ దాడుల్లో డిప్యూటి ఎగ్జికుటివ్ ఇంజనీర్ పి.రవికుమార్, డివిజనల్ పరిధిలోని డీఈఈలు, ఏఈఈలు, జెఈలు, ఎల్ఎలు, ఎల్ఎంలు, 40 మంది అధికారులు, 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.
