గత ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనం 18 ఎకరాలలో 206 అడుగుల ఎత్తులో నిర్మించిన డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరచకుండా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసారని మాల మహానాడు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య పేర్కొన్నారు. స్మృతి వనాన్ని సందర్శించిన దారా అంజయ్య మాట్లాడుతూ… స్వరాజ్ మైదాన్ అంబేద్కర్ విగ్రహం దుమ్ము పట్టి అపరిశుభ్రంగా ఉందని లోపల నిర్మించిన విహార మినీ థియేటర్, శాంతి మండలం, జ్ఞాన నడప, కన్వెన్షన్ సెంటర్, కాల చక్ర మహా మండపం, బుద్ధుని బోధి వృక్షం, రాజ్యాంగ పీఠికను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించటం అనేక కళారూపాలతో నిర్మించిన ఈ శృతి వనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు 9 నెలల నుండి జీతాలు ఇవ్వనందున శుభ్రం చేసే వర్కర్లు లేక దుర్గంధం వెదజల్లుతూ ఆకతాయిలకు మందు బాబులకు నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వంలో ఎవరున్నా మన రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ కు అవమానం జరిగేలా వివక్ష చూపకూడదని పరిసర ప్రాంతాలు శుభ్రం చేయించకుండా చూసి చూడనట్లు వ్యవహరించటం అంబేద్కర్ను అవమానించడమే అన్నారు. వెంటనే కార్మికులకు జీతాలు చెల్లించి దీనిపై కమిటీని ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు కమిటీ చూసుకొని స్మృతి వనాన్ని సుబ్రపరిచేలా ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులతో స్వరాజ్ మైదాన్ స్మృతి వనాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని దారా అంజయ్య కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
