జూబ్లిహిల్స్ నవంబర్ 9 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఎర్రగడ్డ డివిజన్ నివాసితులకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.జూబ్లీ హిల్స్ పరిధిలో స్థానికేతరులు వుండకూడదు అని బాలానగర్ ఏ సి పి పింగిలి నరేష్ రెడ్డి తెలియ జేశారు. మంగళవారం పోలింగ్ దృష్ట్యా, రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచారం, బహిరంగసభలునిర్వహించడాన్ని నిషేధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నివాసాలలో, హోటళ్లు, లాడ్జీలలో స్థానికేతరులు బస చేయరాదని, అలాగే సౌండ్ బాక్సులు, మైక్‌ల వాడకాన్ని కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు, ఈ నియోజకవర్గ పరిధిలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (BNSS) అమలులో ఉంటుందని, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం పరధిలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్లలో విక్రయాలు జరగవని, ఎన్నికలు ముగిసే వరకు మూసి ఉంటాయని ఏ సి పి నరేష్ రెడ్డి తెలియ జేశారు.
