దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లను తాళ్లూరు వైఎస్ ఎంపీపీ దంపతులు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఇడమకంటి రమాదేవి ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసారు. తాళ్లూరు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ లో గట్టి పట్టు ఉన్న నాయకులలో ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ఒకరు. పార్టీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్లో తర్వాత వైఎస్సార్సీపీలో కొనసాగారు. ఇడమకంటి రమాదేవి ఒక దఫా, వెంకటేశ్వర రెడ్డి ప్రస్తుతం వైస్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీ ఓటమితో ఆయన అనుచరుల కోరిక మేరకు గ్రామ అభివృద్ధి నిమిత్తం ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి దంపతులను కలిసారు. అయితే గత కొన్ని నెలలుగా టిడిపి పార్టీలో చేరేందుకు వైస్ ఎంపీపీ తన అనుచరులతో మతనాలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ నేపధ్యంలోనే డాక్టర్ గొట్టిపాటి దంపతులను తాళ్లూరు మండల టిడిపి నాయకులతో కలసి కలిసినట్లు తెలుస్తుంది. ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్డి. క్లస్టర్ ఇన్చార్జి వెంకట రావు, మాజీ బీసీ సెల్ బాధ్యుడు పిన్నిక రమేష్, నవులూరి విద్యాసాగర్ల అధ్వర్యంలో డాక్టర్ గొట్టిపాటిని కలసి పుష్పగుజ్జం అందించారు.

