రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి , జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11వ తేదీన పీసీ పల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల ( ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేయుచున్న సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి , జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ,కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఆనంతరం ముఖ్యమంత్రి గారి పర్యటన నిమిత్తం నియమించిన ప్రత్యేక అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు తెలియచేశారు. హెలిప్యాడ్ ప్రదేశం, సభ వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్ మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ జరుగుతున్న అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం ఎస్పీ వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో డయాస్, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. సీఎం పర్యటన సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా మరియు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని, ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ వెంట ఎస్ ఎస్ జి అడిషనల్ ఎస్పీ యస్.వి రమణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, పిసీఆర్ సిఐ దుర్గ ప్రసాద్,యం. శ్రీనివాసరావు, కనిగిరి సిఐ ఖాజావల్లి, పామూరు సిఐ యం.శ్రీనివాసరావు, అర్ఐ రమణ రెడ్డి, ఎస్సైలు మరియు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *