గచ్చిబౌలి వేదికగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కీర్తి ఘట్టం -ముగిసిన ముగిసిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 పోటీలు -ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతోనే అంతర్జాతీయ క్రీడా పోటీలు – డాక్టర్ సోనీ బాలాదేవి -బ్యాడ్మింటన్ క్రీడ అన్ని విధాల అభివృద్ధి చెందుతోంది – పుల్లెల గోపిచంద్

హైదరాబాద్, నవంబర్ 9:(జే ఎస్ డి ఎం న్యూస్)
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనిఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న ప్రోత్సాహక విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగానిలుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతీ ప్రతిభావంతుడికి అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తున్నాయన్నారు.
ఇలాంటి టోర్నమెంట్‌లు యువ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి అని పేర్కొన్నారు.
జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపిచంద్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, కోచ్‌లు చేస్తున్న కృషి వల్ల క్రీడాకారులు ప్రపంచస్థాయిలో గుర్తింపుపొందుతున్నారన్నారురాబోయే కాలంలో తెలంగాణ నుంచి మరిన్ని స్టార్ ప్లేయర్లు వెలుగులోకి వస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజేతలైన భారతీయ మరియు విదేశీక్రీడాకారులు తమ అనుభవాలనుపంచుకున్నారు. నిర్వాహకులు రాష్ట్ర క్రీడా శాఖ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో క్రీడా శాఖ అధికారులు, కోచ్‌లు, జాతీయ స్థాయి అంపైర్లు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున హాజరై పోటీలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా క్రీడాకారులను అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *