బేగంపేట నవంబర్ 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మూవీ ఆర్టిస్ట్స్ సభ్యుల ఆరోగ్యం,మా,కు అత్యంత ప్రాధాన్యం అని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు.కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి సహకారంతో
ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.కిమ్స్ సన్‌షైన్ మల్టీ-స్పెషాలిటీఆసుపత్రులతో కలసి క్రమం తప్పకుండా మెడికల్ క్యాంప్‌లు నిర్వహిస్తూ, సభ్యుల ఆరోగ్యం మరియు సంక్షేమాన్ని ప్రధాన ప్రాధాన్యంగాకొనసాగిస్తున్నారుఈ కార్యక్రమాలలో ఎంఏఏ సభ్యులు చురుగ్గా పాల్గొనడం తోపాటు సానుకూల స్పందన అందిస్తున్నారు.గత ఆదివారం, కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి సహకారంతో ఎంఏఏ సభ్యుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎంఏఏ అధ్యక్షుడు విష్ణు మంచు, జనరల్ సెక్రటరీ రఘు బాబు, ట్రెజరర్ శివ బాలాజీ, నటుడు రాజీవ్ కనకాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సన్‌షైన్ తరఫున సి ఓ ఓ సుదాకర్ జాధవ్, సీనియర్ కన్సల్టెంట్ & జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నవ్ వికాస్ జుకంటి, కన్సల్టెంట్
వాస్క్యులర్, ఎండోవాస్క్యులర్ & డయబెటిక్ ఫూట్ స్పెషలిస్ట్ డాక్టర్ నిశాంత్ రెడ్డి, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & హెపటాలజిస్ట్ డాక్టర్ ముడుమల ఐజాక్ అభిలాష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ, మన సభ్యులందరికీ మరియు ఆసుపత్రి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేశారు.సభ్యుల ఆరోగ్యం మాకు అత్యంత ప్రాధాన్యం.అన్నారు.
అందుకే ఇలాంటి క్యాంప్‌లను తరచూ నిర్వహిస్తున్నామని అన్నారు. కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తేలియజేశారు.
కోశాధికారి శివ బాలాజీ మాట్లాడుతూ, ఎంఏఏలో తాము ఎల్లప్పుడూ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమాన్ని ముందు వరుసలో పెట్టుకుంటాం. అన్నారు. అందుకే ఇటువంటి ఆరోగ్య శిబిరాలు తరచుగా నిర్వహిస్తున్నాం. అన్నారు.ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, కళాకారులు తరచుగా సమయాన్ని, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కష్టపడతారు. సభ్యుల కోసం ఎంఏఏ ఇటువంటి ఆరోగ్య శిబిరాలు నిరంతరం నిర్వహించడం చాలా అభినందనీయం అన్నారు.
కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి సీవోఓ సుదాకర్ జాధవ్ మాట్లాడుతూఎంఏఏ సభ్యుల కోసం ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం గొప్ప కార్యక్రమం. దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విష్ణు మంచుకి అభినందనలు. ఇలాంటి ప్రయోజనకరమైన కార్యక్రమాలకు మేము ఎల్లప్పుడూ సహకరించేందుకు ముందుంటామని తెలిపారు.
సభ్యులందరికీ ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, గ్యాస్ ట్రయిన్ట్రాలజీ, వాస్కులర్, గైనకాలజీ, ఆప్తమాలజీ వైద్య పరీక్షల నిర్వహించి డాక్టర్లు పలు సలహాలు సూచనలు చేశారు.


