హైదరాబాద్ , నవంబర్ 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్లేట్ స్మార్ట్ స్టార్ట్ 5కే రన్ ను ఆదివారం పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు నిర్వహించారు.ఈ పరుగు లో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.5K Against 5 Pitfalls = ONE Mission” అనే థీమ్‌తో , జలవిహార్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు మరియు తిరిగి జలవిహార్ వరకు, నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ జోన్ డీ సి పి శిల్పవల్లి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి , మరియు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి ముఖ్య అతిథులగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ ప్రచార కార్యక్రమం ద్వారా, స్లేట్ ది స్కూల్ తల్లిదండ్రులను, విద్యార్థులను మరియు సమాజాన్ని ఈ రోజుల్లో మనిషి జీవితాన్ని దెబ్బతీస్తున్న ఐదు ప్రధాన ప్రమాదాల (PITFALLS) వ్యతిరేకంగా ఏకం చేశారని చెప్పారు.
బెట్టింగ్ (జూదం) సరదాగా ప్రారంభమయ్యే ఇది, క్రమంగా వ్యసనంగా మారి కుటుంబాలలో శాంతి, ఆర్థిక స్థితి,ఆస్తులను, ఆశలను నాశనం చేస్తుంది అన్నారు. వేగంగా సంపాదించాలనే ఆశతో చాలా మంది తమ భవిష్యత్తును కోల్పోతున్నారు. నిజమైన విజయానికి మార్గం కష్టపడి పనిచేయడమే నన్నారు.లోన్ యాప్స్ సులభంగా రుణాలు ఇవ్వడమనే మాయలో పడిన అనేక కుటుంబాలు అధిక వడ్డీ, వేధింపుల భారంతో కృంగిపోతున్నాయి. ఈ ప్రమాదం కుటుంబ గౌరవం మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందన్నారు.
జంక్ ఫుడ్ – ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి ఆరోగ్యకరమైన అలవాట్లను నశింపజేస్తోంది. ఇది ఊబకాయం, జీవనశైలి వ్యాధులు, మరియు రోగనిరోధక శక్తి తగ్గింపుకి దారితీస్తుంది. ఆరోగ్యం కోల్పోతే ఉత్సాహం, ఉత్పాదకత, మరియు జీవిత నాణ్యత కూడా తగ్గిపోతాయి.
మొబైల్ వ్యసనం – టెక్నాలజీ వరమైందే కానీ దాని దుర్వినియోగం పిల్లల అమాయకత్వాన్ని, పెద్దల మానసిక ప్రశాంతతను దోచుకుంటోంది. కుటుంబాలు కలిసే ఉన్నప్పటికీ వేరుపడుతున్నాయి. మొబైల్ దుర్వినియోగం ఆందోళన, ఒంటరితనం, మరియు ఏకాగ్రత కోల్పోవడానికి కారణమవుతోంది.రొట్ లెర్నింగ్ (పఠనం ఆధారిత విద్య) – పాఠశాలలు సృజనాత్మకత, ఆలోచనాత్మకతను పెంపొందించకపోతే, దేశం ఆవిష్కర్తలు, నాయకులు, మరియు ఆలోచనకర్తలను కోల్పోతుంది. మార్కుల కంటే మెదడును తీర్చిదిద్దే విద్య అవసరం.స్లేట్ స్మార్ట్ స్టార్ట్ లో సుమారు 4000 మంది తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాకుండా ఒక సామాజిక అవగాహన మరియు మార్పు ఉద్యమం లా కొనసాగింది, భవిష్యత్తును కాపాడే దిశగా ఒక బలమైన అడుగుగా ఈ 5 కే పరుగు నిలిచింది.

