జూబ్లిహిల్స్ నవంబర్. 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజక వర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు.ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.దీనిలో భాగంగా, ఆదివారం బాలానగర్ మండలం పరిధిలోని పాలక్ హోటల్‌లో స్థానికేతరులు బస చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలుచేపట్టారు.బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం ఆకస్మిక తనిఖీలను నిర్వహించింది.
ఈ సందర్భంగా, హోటల్‌లో బస చేస్తున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా,
వారు నర్సాపూర్, మేడ్చల్ ప్రాంతాలకు చెందిన నివాసితులుగా గుర్తించారు.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఏసీపీ నరేష్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, ఆయన తెలిపారు.
