జిల్లాలో అర్హత కలిగిన 9, 10, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పీఎం యశస్వి సెంట్రల్ స్కీమ్ ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ లో బాగంగా ఒబీసీ, ఈబీసీ, డీఎన్ టి వారి స్కీము ద్వారా ఉపకార వేతనం పొందటానికి అర్హలైన విద్యార్థులు నమోదు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి నిర్మల జ్యోతి కోరారు. ఈనెల 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హలైన వారికి 9,10 విద్యార్థులకు 75వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.1,25000 చొప్పున ప్రభుత్వం ఉపకార వేతనం మంజూరు చేయటం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు
పీఎం యశ్వస్వి ఉపకాత వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం
10
Nov