కార్తీక మాసం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని సాయిబాబా ఆలయంలో సోమవారం మటంపల్లి దక్షిణామూర్తి ఆద్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుందని అన్నారు . కార్యక్రమంలో తాతా ప్రసాద్ , ఆత్మకూరి బ్రహ్మయ్య , ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి పెదరులు పాల్గొన్నారు.


