బాలీవుడ్ నట దిగ్గజం, సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర వయసు 89 సంవత్సరాలు.
1935 డిసెంబర్ 8న పంజాబ్ లోని లుథియానా జిల్లా సస్రలీ అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయుడిగా పని చేసేవారు. ప్రముఖ సినీ నటి హేమమాలినిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో సన్నీ డియోల్, బాబీ డియోల్, ఈశా డియోల్, విజేత డియోల్, అహానా డియోల్, అజీతా డియోల్ ఉన్నారు. ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్.
