పేద బడుగు బలహీన వర్గాల కు మెరుగైన విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఆ బాధ్యతను మరువద్దని జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులో కోర్టు ఆవరణలో మంగళవారం వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత ఆయనదే అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కాలేజి కూడ మంజూరు చేయలేదని అన్నారు. పెద బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్ జగన్ మెడికల్ కాలేజిలు మొదలు పెట్టారని వాటిని కాపాడుకునేందుకు ప్రజలతో కలసి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని గ్రామాలలో సంతకాల సేకరణ చేసామని అన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన రిమ్స్ పేదలకు ఎంతగానో ఉపయోగ కరంగా ఉన్నదని ఆవిషయం కోవిడ్ సమయంలో కూడ ఎంతో అవగత మైనదని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు సృష్టిస్తామని చెబుతూ బినామీల కోసం పప్పులు బెల్లం లాగే కాలేజీలను అమ్మి వేస్తున్నారని ఆరోపించారు. టిడిపి వారి సోషల్ మీడియా కళాశాల భవనాలు ఎక్కడా కట్టలేదని చెపుతున్నారని కానీ వైసీపీ హయాంలో ఏడు పూర్తి అయ్యాయని చెప్పారు.
చంద్రబాబు సీఎం అయిన తర్వాత రూ. 2లక్షల కోట్లు అప్పు తెచ్చిన వారు మెడికల్ కాలేజీలకు 2000 కోట్లు వెచ్చించలేరా అని .. అన్నారు.
సూపర్ సిక్స్ కూడ పూర్తిగా అమలు చేయలేని పరిస్థితి ఉన్నదని, మునిగిపోతున్న అమరావతి కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారని స్వచ్చందంగా సంతకాల సేకరణలో పాల్గొనటమే అందుకు నిదర్శమని అన్నారు. ప్రభుత్వం మెరుగైన వైద్య, విద్య అందించలేని పరిస్తితి ఉన్నదని అన్నారు… ప్రతి నియోజక వర్గంలో ఈనెల 12న సంతకాలు చేపతున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏదీ ఫ్రీగా చేయ్యరని, పది సంవత్సరాల క్రితం కనిగిరి వద్ద నిష్ట కోసం తీసుకున్న స్థలంలో 20 ఎకరాలు ఎం ఎస్ ఎంఈ అంటూ కేటాయించారని అన్నారు. చీమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ పరిశ్రమలకు రాయితీ ఇవ్వక మూత వేత దిశలో ఉన్నాయి. కొంత పరిశ్రమలు అంటూ చంద్రబాబు నాయుడు పబ్లిక్ సిటీ స్టంట్ మాత్రమే అని విమర్శించారు. ఆయన అంత ఆర్టిస్ట్ ఎవ్వరూ లేరని అన్నారు. చంద్రబాబు నాయుడిది అంతా బుస్..నమ్మవద్దు. వైఎస్ .జగన్తోనే భవిష్యత్ అని చెప్పినదే చేసే ప్రభుత్వం వైఎస్ జగన్దేఅన్నారు. కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు ఇన్చార్జి చుండూరి రవి, మార్కాపురం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగిరి కంటి శ్రీనివాస రావు, పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగిరి కంటి శ్రీనివాస రావు, న్యాయవాది, హెచ్ ఎం పాడు ఎంపీపీ గాయం సావిత్రి, లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి నాగమల్లేశ్వర రెడ్డి, న్యాయవాదులు గోపు శ్రీను, శ్రీనివాస రెడ్డి, రవి కుమార్, డి హరిబాబు, నాగ రాజు, రామక్రిష్ణ, నాయక్, చందు, స్వామి రెడ్డి, సంపత్ , నిఖిల్ రవిబాబు ,రామకృష్ణ , రాజేశ్వరి, మాధవి, మధు లత, సానికొమ్ము రామి రెడ్డి , శేషా రెడ్డి ,నరేంద్ర రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కె.అదేన్న, కార్పోరేషన్ మాజీ కనకారావు మాదిగ్ , తదితరులు పాల్గొన్నారు.



