ఎస్టీ కాలనీకి చెందిన నాగులూరి బాబులు (25) ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబానికి టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్లు సానుభూతి తెలిపారు. తాళ్లూరు నాయకులు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి ద్వారా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో నీటి సంఘ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు సుబ్బా రావు, ఆదాం, సత్యవర్ధన్, ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.
