తాళ్లూరు వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ఆయన సతీమణి మాజీ వైస్ ఎంపీపీ ఇడమకంటి రమాదేవిలు వారి అనుచరులతో కలసి వైసీపీ పార్టీని వీడి తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు నబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఇడకమకంటి వెంకేటేశ్వర రెడ్ది కుటుంబం, వారి పెద నాన్న ఇడమకంటి గురువా రెడ్డి పూర్వపు మండల అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ సేవలు అందించారు. ఆయన తర్వాత వారి వారసులు ఇడమకంటి వేణుగోపాల్ రెడ్డి వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా దశాబ్దకాలం పనిచేసి, దర్శి మార్కేట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసారు. వారి కుటుంబంలోని గురువా రెడ్డి తమ్ముడి కుమారులు వెంకటేశ్వర రెడ్డి, ఆయన కోడలు రమాదేవి కాంగ్రెస్ పార్టీలో, అనంతరం వైసీపీ పార్టీలో సుదీర్ఘకాలం క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసారు. ఫలితంగా రెండు దఫాలుగా వారికి పార్టీ అధిష్టానం గుర్తించి ఇడమకంటి రమాదేవిని ఒక దఫా, మరోక దఫా ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డిలకు వైస్ ఎంపీపీలుగా స్థానం కల్పించారు. తాళ్లూరు పంచాయితీలో క్షేత్ర స్థాయిలో బలమైన నాయకునిగా, మంచి పేరున్న నాయకునిగా, మాట ఇస్తే తప్పని నాయకునిగా మంచి పేరు సంపాదించుకని గురువా రెడ్డి వారసులుగా గుర్తింపు పొందారు. అయితే గత కొంత కాలంలో వైసీపీ పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపధ్యంలో వారి నాయకత్వాన్ని గుర్తించిన టిడిపి నాయకులు పార్టీలోనికి ఆహ్వానించారు. అందుకు అనుగుణంగా నరసరావు పేటలో ఆదివారం దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల ను
వైన్ ఎంపీపీ దంపతులు కలిసారు. వారి మనోభావాలను పంచుకున్నారు.
పార్టీ సముచిత స్థానం కల్పించింది… ఎమ్మెల్యే బూచేపల్లి వద్ద కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదు…. వైన్ ఎంపీపీ యిడమ కంటి
ఈ సందర్భంగా బుధవారం వైన్ ఎంపీపీ మాట్లాడుతూ వైసీపీ పార్టీ తమ కుటుంబానికి సముచిత స్థానం కల్పించి రెండు దఫాలుగా వైన్ ఎంపీపీ పదవి ఇచ్చి బాగా ఆదరించిందని చెప్పారు. అయితే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వద్ద కష్టపడి పనిచేసే కార్యకర్తలకు చివరికి అవమానమే మిగులు తుందని ఆవేదన వ్యక్తంచేసారు.
పార్టీని వీడి గురువారం టిడిపిలో చేరుతున్నట్లు తెలిపారు.

