మైనారిటీ హక్కుల కోసం కృషి చేయాలి – ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సూచన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులుగా నామినేట్ అయిన కఫిల్ భాష మైనార్టీ హక్కుల కోసం వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సూచించారు . మైనారిటీ కమిషన్ సభ్యులుగా నామినేట్ అయిన కఫిల్ బాషా తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులతో కలిసి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ నిష్పక్షపాతంగా అందర్నీ కలుపుకొని పోతూ మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. కఫిల్ భాష మాట్లాడుతూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తనపై పెట్టుకుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందర్నీ కలుపుకొని ముస్లిం సంక్షేమం కోసం మైనార్టీ హక్కుల కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పఠాన్ హనీఫ్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ అజీమున్నీసా , ఒంగోలు నగర మైనారిటీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ శిలార్ పఠాన్ నాయబ్, నియోజకవర్గ కార్యదర్శి షేక్ మున్నా , జమీల్ భాష, సయ్యద్ అల్లా బక్షు, షేక్ గౌస్ బాషా, సయ్యద్ కరిముల్లా, 3,4 డివిజన్ల టిడిపి అధ్యక్షులు షేక్ అల్లాబక్షు, మహమ్మద్ ఖాన్, ఒంగోలు ఖబరస్థాన్ కమిటీ అధ్యక్ష.. కార్యదర్శులు షేక్ మస్తాన్ వలి , షేక్ జిలానీ, టిడిపి
మైనారిటీ నాయకులు షేక్ కాలేషా బాబు, షేక్ అల్తాఫ్,
పఠాన్ నజీర్ ఖాన్, సిద్ధిక్, యూసుఫ్, షేక్ కాలేషా, పలువురు మత పెద్దలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *