58వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భంగా వారోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాజా బాబు బుధవారం ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈనెల 14 నుండి 20 వరకు జిల్లా గ్రంధాలయంలో వారోత్సవాలు జరుగుతాయని ప్రకాశం జిల్లా గ్రంధాలయ కార్యదర్శి జీవీ శివా రెడ్డి తెలిపారు. జిల్లా గ్రంధాలయ ఇన్చార్జి డిప్యూటీ లైబ్రరియన్ కె సంపూర్ణ కాళ హస్తి, కమిటీ సభ్యులు డాక్టర్ మధుర శ్రీ కవి, బంది కట్ల నాగేశ్వర రెడ్డి, కార్యాలయ సిబ్బంది టి క్రిష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.
