ఆంధ్ర ప్రదేశ్ సర్వ శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ ( ఎస్ జి టి)లకు మైనంపాడు డైట్లో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బా రావు తెలిపారు. ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ మీద ఒక రోజు శిక్షణ ఉంటుందని చెప్పారు. మండల విద్యాశాఖాధికారులు మండలానికి నలుగురు చొప్పున ఎంపిక చేసి పంపాలని, ప్రత్యేక శిక్షణ పొందిన ఆర్ పీ లు శిక్షణ ఇస్తారని తెలిపారు. 17న ఒంగోలు డివిజన్ పరధిలోని ఉపాధ్యాయులకు, 18న మార్కాపురం డివిజన్ పరధిలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు.
ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ మీద డైట్లో శిక్షణ
12
Nov