ప్రకాశం జిల్లా లో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలను ఈనెల 14 నుండి 20వ తేది వరకు జిల్లా సహకార శాఖ అధ్వర్యంలో నిర్వహించనున్నట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి డి శ్రీలక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్ను బుధవారం జిల్లా కలెక్టర్ రాజా బాబు అవిష్కరించారు. ఆత్మ నిర్బర్ భారత్ సాధకాలుగా సహకార సంఘాలు అను ప్రధాన అంశంగా సహకార వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కోఆపరేటివ్ అధికారి డి శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాలలో ఏడు రంగుల సహకార పతాక ఆవిష్కరణ, సహకార ప్రతిజ్ఞ, సహకార ర్యాలీలు నిర్వహించబడునని చెప్పారు.
