ఆర్థిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండ టం ద్వారా మేలు జరుగుతుందని ఉప్పుగుండూరు పిడిసిసి బ్యాంక్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం ఉప్పుగుండూరు పిడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత మరియు డిజిటల్ లావాదేవీలు పై నాబార్డ్ వారి సౌజన్యంతో ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ద్వారా కళాజాతర,వీధినాటిక కార్యక్రమము వి.సత్యకృష్ణ కళాజాత. తాడేపల్లిగూడెం బృందం వారిచే ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు ప్రధాన కూడలి అయిన బస్టాండ్ సెంటర్లలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఎస్.శ్రీకాంత్ మాట్లాడుతూ.. బ్యాంక్ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. నగదు రహిత లావాదేవీలు, వ్యవసాయ రుణాలు బంగారు ఆభరణాలపై రుణాలు గృహ రుణాలు. వ్యాపార రుణాలు, డ్వాక్రా రుణాలు మరియు సహకార సమైక్య. లాకర్ సదుపాయం. ఫిక్స్డ్ డిపాజిట్లు. ధన వృద్ధి డిపాజిట్ స్కీమ్.సహకార బ్యాంక్ అకౌంట్స్. మరియు సైబర్ క్రైమ్ ,భీమా పథకాలు , మరియు.బ్యాంక్ వారు అందించే అన్ని విషయాలపై. అవగాహన కలిగి ఉండాలన్నారు అదేవిధంగా రైతులుకు , మహిళలుకు, ప్రజలకు అర్థమయ్యే రీతిలో వీధి నాటిక కళాజాత ప్రదర్శన కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు,రైతులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

