బేగంపేట నవంబర్ 13
(జే ఎస్ డి ఎం న్యూస్) :
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతుందని టి పి సి సి ఉపాధ్యక్షుడు ,కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. బేగంపేట డివిజన్ పరిధిలో నీ మయూరిమార్గ్ లో బాలాజీ ప్రశాంత్ మనోహర్ లా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని గురువారం బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఎగుర వేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తుందన్నారు . నగర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు .గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు ఒక్కరేషన్ కార్డు ఇచ్చిన పాపానపోలేదన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపైఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల అమలు జేస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విశాల్ సుధాం,హాజీ టోచర్, లక్ష్మయ్య ,జైపాల్, నర్సింగ్ రావు,జ్ఞానేశ్వర్ ,దయానంద్, పర్వేజ్ ,అలీ ,అరుణ్, బాలకృష్ణ, నసీరుద్దీన్ (అడ్డూ ),అత్తర్, రమాదేవి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.



