అధికారులు, ప్రజా ప్రతినిథులు సమన్వయంతో పనిచేసి గ్రామాలలో స్వచ్చత సాధించాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయితీల సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైనది. ఎంపీడీఓ అజిత అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి పంచాయితీలో అపరిశుభ్రంగా ఉన్నట్లయితే వ్యాధులు ప్రజలే అవకాశం ఉ న్నందున ముందుగా క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఆరోగ్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజలను చైతన్య వంతం చెయ్యటంతో పాటు ప్రభుత్వ వనరులను పూర్తి స్థాయిలో గ్రామ కార్యదర్శులు సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలని కోరారు. స్థానిక ప్రజా ప్రతినిథులలో సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని చెప్పారు. డిప్యూటీ ఎంపీడీఓ నాగమల్లేశ్వరి, టిఓటీ సుబ్బా రెడ్డి, సర్పంచిలు, ఉప సర్పంచిలు పాల్గొన్నారు.

